ప్రొఫెసర్ కాశీంకు బెయిల్ మంజూరు

by Shyam |
ప్రొఫెసర్ కాశీంకు బెయిల్ మంజూరు
X

దిశ, న్యూస్ బ్యూరో: విప్లవ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చింతకింది కాశీంకు హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే మూడు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరుకాగా తాజాగా మరో మూడు కేసుల్లో మంజూరైంది. దీంతో ఆయనపై నమోదైన మొత్తం ఆరు కేసుల్లో బెయిల్ లభించినట్టయింది. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారని, నిషేధిత విప్లవ సాహిత్యాన్ని కలిగి ఉన్నారని, మావోయిస్టు పార్టీకి చెందిన ఒక సంస్థలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నారన్న పలు అభియోగాలతో ఆయనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఊపా)లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్, ములుగు, చర్ల పోలీసు స్టేషన్ల పరిధిలో ఊపా చట్టం కింద గతంలో కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story