మరో వందేళ్లైనా అంబేద్కర్ లాంటి వ్యక్తి పుట్టడు : ఘంటా చక్రపాణి

by Shyam |
Professor Ghanta Chakrapani
X

దిశ ప్రతినిధి, వరంగల్: ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి నిజమైన మార్గదర్శకుడని మాజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి తక్కెళ్ళపల్లి పురుషోత్తమరావు నివాసంలో తెలంగాణ జనవేదిక ఆధ్వర్యంలో సదస్సులో జరిగింది. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కెళ్ళపల్లి రాము నేతృత్వంలో ‘‘నవ భారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్’’ అంశంపై జరిగిన సదస్సుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ సోషియాలజీ ప్రొఫెసర్, మాజీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ వుంటా చక్రపాణి హాజరై కీలక ప్రసంగం చేశారు.

అంబేద్కర్ యూరప్, అమెరికా వంటి దేశాల్లో చదువుకున్నారని, దేశంలోని మోజర్టీ ప్రజల ప్రతినిధిగా స్వాతంత్య ఉద్యమ పోరాటంలో క్రియాశీలకంగా పనిచేశారని చెప్పారు. బ్రిటీష్ ప్రభుత్వానికి సామాజిక, రాజకీయ అంశాలపై సమగ్రమైన అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారని తెలిపారు. దేశంలోని సామాజిక పునాదులలో మతం, కుల అంతరాలనూ సమగ్రంగా బ్రిటీష్ ప్రభుత్వానికి సుదీర్ఘమైన రిపోర్టును సైమన్ కమిషను అంబేద్కర్ ఇచ్చారని తెలిపారు. భారతదేశ సామాజిక, ఆర్థిక, విద్య వ్యవస్థ, రాజకీయలతో పాటు ప్రత్యేకంగా మహిళల హక్కులు కోసం అంబేద్కర్ పనిచేశారని చెప్పారు. రాబోయే 100 ఏళ్ళలో అంబేద్కర్ లాంటి లోతైన సామాజిక వేత్త పుడుతారని అనుకోలేమని అన్నారు. అంబేద్కర్‌కు కాంగ్రెస్, ముస్లింలీగ్‌లు సరైన గుర్తింపు ఇవ్వలేదని చెప్పారు. 1919 మహరాష్ట్ర బాంబే ప్రెసిడెన్సీకి ఎంపిక చేసిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాణానికి అంబేద్కర్ సరైన వారిని గుర్తించారని చెప్పారు. అనంతరం తక్కెళ్ళపల్లి రాము మాట్లాడుతూ.. సమాజంలో అనేక రుగ్మతలకు మార్క్స్, గాంధీ, అంబేద్కర్‌‌లు సరైన మార్గనిర్దేశనం చేశారని చెప్పారు.

అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా, దేశ ఔన్నతికి పునాది వేశారని చెప్పారు. చిన్న చిన్న రాజ్యాలుగా భిన్న మతాలు, వర్గాలు, కులాలు భాషలుగా విడిపోయి ఉన్న ఇండియాను ఒక దేశంగా గొప్పగా నిర్మించారని చెప్పారు. దేశంలో అంబేద్కర్ కృషి మరిచిపోలేదని కొనియాడారు. సభలో అంబేద్కర్ రాజ్యాంగ పీఠిక చదివారు. ఈ సదస్సులో సంయోజకులుగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు, డాక్టర్ కొట్టే భాస్కర్, డాక్టర్ ఎప్రామాజ్, జేమ్స్ ప్రశాంత్, అమత్యన్రెడ్డి, అహ్మద్ బేగ్, అర్చన, అరుణ, అశోక్ కుమార్, సంజీవ్ రెడ్డి, రంగారావు, డాక్టర్ భుజేందర్రెడ్డి, వర బ్రహ్మయ్య, ప్రొఫెసర్ బిష్ణుచరణ్ చౌదరి, రమేశ్ బాబు, ప్రొఫెసర్ చెనబసవయ్య, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శ్రీనివాస్, ప్రొఫెసర్ సుధాకర్, డాక్టర్ హరిత, డాక్టర్ రాజేశ్, డాక్టర్ రమ, ఆశ్రిత, హరిప్రసాద్, గాంధీ, లక్ష్మినారాయణ, మహేశ్ రెడ్డి, మల్లేశం, నారాయణ, మనోజ్ రెడ్డి, కుమార్, సురేంద్రనాథ్, స్వప్పు, పావని, ప్రొఫెసర్ స్వామి, చక్రపాణి, రవీందర్, సుబ్బారావు, అంజన్ రావు, శివకుమార్ గౌడ్, ప్రొఫెసర్ మనోహర్, ఉదయ భానురావు, ప్రీతమ్, వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed