- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రొఫెషనల్ దొంగలు.. చేతికి ఆయిల్.. ఆపై
దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో దొంగలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా దొంగలు పక్కా స్కెచ్ వేసి భారీ చోరీలకు పాల్పడేవారు. ఇప్పుడు వారి అంచనాలు తప్పుతున్నాయి. గత 15 రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో చదువుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్లు దొంగిలించారు. శనివారం అర్ధరాత్రి అడ్లూరులో జరిగిన దొంగతనాలు విచిత్రంగా మారాయి. అడ్లూరు గ్రామంలోని మూడు ఇళ్లను ప్రొఫెషనల్ దొంగలు ఎంచుకున్నారు. మొదటగా ఇల్చిపూర్ రోడ్డులో గల రాజాగౌడ్ ఇంటిని ఎంచుకుని ఆ ఇంట్లో ఉన్న కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడి సుమారు రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ పక్క గల్లీలోనే ఉన్న గోవర్ధన్ ఇంటికి దొంగలు చోరీకి వెళ్లారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లగా దొంగలకు షాక్ తగిలింది.
ఆ ఇల్లు కాస్త అంగన్వాడీ కేంద్రం కావడంతో అక్కడ వారికి ఒక్క రూపాయి కూడా చిక్కలేదు. అక్కడినుంచి బస్టాండ్ వద్ద గల అంజాగౌడ్ ఇంటిలో దొంగతనానికి పాల్పడగా అది హోటల్ అయింది. దాంతో అక్కడ కూడా వారికి రూపాయి కూడా చిక్కలేదు. మూడు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగలు పోలీసులకు చిక్కకుండా భారీ ప్లాన్ వేశారు. ఒక్క ఇంట్లో కూడా దొంగలు తమ వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్తపడ్డారు. దొంగతనానికి పాల్పడే సమయంలో చేతులకు ఆయిల్ అప్లై చేసినట్టు తెలుస్తోంది. మూడు ఇళ్లలో చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దాంతో ప్రొఫెషనల్ దొంగలే ఈ చోరీలకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.