- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు నిర్మాత బన్నీ వాసు లేఖ..
దిశ, సినిమా : గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చయ్‌కు లేఖ రాశారు ప్రముఖ నిర్మాత బన్నీవాసు. ఇంటర్నెట్ స్వేచ్ఛ గురించి రాసిన లేఖలో.. సోషల్ మీడియా తప్పుడు ప్రచారం వల్ల తన కుమార్తె వేదన అనుభవించిందని తెలిపాడు. తన కూతురిని చంపుతానని వార్నింగ్ ఇస్తూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పెట్టాడని.. దాన్ని తొలగించేందుకు తల ప్రాణం తోకకు వచ్చిందన్నాడు. పోలీసుల కంటే సోషల్ మీడియా కంప్లైంట్ సెల్‌కే ఎక్కువ ఫిర్యాదులు ఇచ్చినట్లు చెప్పాడు.
అలాగే ఒకరు పోస్ట్ చేసిన న్యూస్ అబద్ధమని నిరూపించేందుకు సామాజిక మాధ్యమాల కంటే కోర్టుల్లోనే సులభమన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతూ.. పూర్వం ఒక వ్యక్తి పరువు తీయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఫొటోల మార్ఫింగ్, వక్ర భాష వస్తే చాలు ఎవరి జీవితాన్నైనా నాశనం చేయొచ్చని వివరించాడు. ఒక పద్దతి, నియంత్రణ లేని సమాచారం సమాజంలో ఓ వ్యక్తిని నగ్నంగా నిలబెట్టడంతో సమానమన్న ఆయన.. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇంటర్నెట్ చట్టాలు ‘సమాచారం’ అనే మనిషికి బట్టలు కడతాయేమో చూడాలన్నారు.
- Tags
- Bunny Vasu
- letter