4 కోట్ల డోసులు ఉత్పత్తి చేశాం -సీరం

by sudharani |
4 కోట్ల డోసులు ఉత్పత్తి చేశాం -సీరం
X

బెంగళూరు: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 టీకాకు సంబంధించి 4 కోట్ల డోసులు ఉత్పత్తి చేశామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సోమవారం తెలిపింది. త్వరలో నోవవాక్స్‌కు చెందిన రైవల్ షాట్ ఉత్పత్తి చేయనున్నామని, రెండు టీకాలకు రెగ్యులేటరీ అనుమతులు తీసుకోనున్నట్లు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఏ కొవిడ్-19 టీకాకు అనుమతులు రాలేదు. అన్ని వ్యాక్సిన్లు కూడా ప్రభావం, భద్రతను పరిశీలించే దశలో ఉన్నాయి. అయితే, కరోనా తీవ్రత దృష్ట్యా వీలైరంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం వ్యాక్సిన్ ప్రయోగ దశలోనే సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇప్పటికే ఉత్పత్తి చేసిన 4 కోట్ల డోసులు ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేయడం కోసం లేదా కేవలం ఇండియాకే పరిమితమా అనే విషయమై సీరం స్పష్టత ఇవ్వలేదు.

Advertisement

Next Story