యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లేఖ

by Shamantha N |
యూపీ సీఎంకు ప్రియాంక గాంధీ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్‌కు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లేఖ రాసారు. ఇటీవల లలిత్ పూర్‌లో కొన్ని ఆవుల కళేబరాల ఫోటోలు చూసిన ఆమె.. తగినంత ఆహారం, నీరు లేక గోవులు మరణించినట్టు కనిపిస్తోందని అన్నారు. అంతేగాకుండా యూపీలో గోవుల పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గోవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖ రాసారు. యోగి అధికారంలోకి రాగానే గోశాలు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అన్నారు. గోశాలల్లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. ఛత్తీస్ గఢ్‌లో ప్రారంభించిన గోధన్ న్యాయ్ పథకం వంటివి యూపీలోనూ చేపట్టాలని సూచించారు. గోవుల సంరక్షణకు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story