నిక్.. ప్రతీక్షణం ‘ఎస్’ చెప్తున్నా: ప్రియాంక

by Jakkula Samataha |
నిక్.. ప్రతీక్షణం ‘ఎస్’ చెప్తున్నా: ప్రియాంక
X

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకన్నా పదేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుంది. భర్త సహకారంతో ఇంటర్నేషనల్ లెవెల్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. కానీ ప్రేమ పెళ్లి చేసుకున్న వీరిద్దరిలో ఎవరు ఎవరికి ముందుగా ప్రపోజ్ చేశారు? అసలు ఎలా ప్రపోజ్ చేశారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు చాలా మంది ఆసక్తి చూపుతుండగా.. ఆ సీక్రెట్‌ను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రివీల్ చేసింది భామ.

తన జీవితంలో జరిగిన గొప్ప ఆనందానికి రెండేళ్లు అంటూ మురిసిపోయింది ప్రియాంక. నిక్ జోనస్ తనను పెళ్లి చేసుకోమని ఇదే రోజున అడిగాడని.. ఆ క్షణం నా దగ్గర మాటలు కరువైనా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ‘ఎస్’ చెప్తున్నానని తెలిపింది. ఈ వీకెండ్ గొప్ప మెమొరబుల్‌గా నిలిచిపోయేలా చేశారని.. ప్రతీ నిమిషం తన గురించి ఆలోచిస్తున్నందుకు థాంక్స్ చెప్పింది. ప్రపంచంలోనే అదృష్టమైన అమ్మాయిని అంటూ ఆనందపడుతున్న ప్రియాంక.. నిక్‌కు ఐ లవ్ యూ చెప్పింది.

నిక్ జోనస్ ప్రియాంక పుట్టినరోజున లవెబుల్ పోస్ట్ పెట్టాడు. నీ కళ్లలోకి చూస్తూ బతికేయగలను అంటూ ప్రియాంకతో ఉన్న క్యూట్ ఫోటో షేర్ చేశాడు. ఇప్పటి వరకు కలిసిన వ్యక్తుల్లో గొప్ప ఆలోచన, కేరింగ్ ఉన్న గొప్ప వ్యక్తి అంటూ భార్యకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. మన ఇద్దరం ఒకరికొకరం దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పాడు నిక్.

Advertisement

Next Story

Most Viewed