Priyamani: అతనితో ప్రియమణి మ్యారేజ్ చెల్లదు : మాజీ భార్య

by Shyam |   ( Updated:2021-07-22 02:56:37.0  )
Priyamani
X

దిశ, సినిమా: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ యాక్ట్రెస్ ప్రియమణి – ముస్తఫా రాజ్‌‌ మ్యారేజ్‌ను సవాల్ చేస్తూ అతని మాజీ భార్య అయేషా కోర్టులో కేసు వేసింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలుండగా.. ముస్తఫా 2017లో ప్రియమణిని వివాహం చేసుకున్నాడు. అయితే తాము ఇప్పటివరకు లీగల్‌గా డైవోర్స్ పొందలేదని, ఈ లెక్కన ప్రియమణితో అతడి వివాహం చెల్లదని ప్రస్తావిస్తూ అయేషా లీగల్ నోటీస్ పంపించింది. అంతేకాదు అతనిపై డొమెస్టిక్ వయొలెన్స్ ఆరోపణలు చేస్తూ మరో కేసు ఫైల్ చేసింది. కాగా ఈ అంశంపై స్పందించిన ముస్తఫా.. ‘తనపై చేసిన ఆరోపణలన్నీ నిజం కావు. అయేషాకు క్రమం తప్పకుండా చిల్డ్రన్ మెయింటెనెన్స్ చెల్లిస్తున్నాను. తను నా నుంచి డబ్బు లాగేందుకు ప్రయత్నిస్తోంది. 2010 నుంచి సెపరేట్‌గా ఉంటున్న మేము 2013లో విడాకులు తీసుకున్నాం. ప్రియమణితో నా వివాహం 2017లో జరిగింది. మరి అప్పటి నుంచి ఎందుకు సైలెంట్‌గా ఉంది?’ అని వివరణ ఇచ్చాడు. అయితే అయేషా మాత్రం తాము ఇప్పటివరకు డైవోర్స్‌కు అప్లయ్ చేయలేదని, ప్రియమణితో పెళ్లి సందర్భంగా కూడా కోర్టుకు తను బ్యాచిలర్ అని తెలిపాడని చెప్పుకొచ్చింది.

తండ్రిపై ‘మీటూ’ ఆరోపణలు.. స్పందించిన అలియా

Advertisement

Next Story