ఆ పని చేసినందుకు హీరోయిన్ సస్పెండ్..

by Shyam |
ఆ పని చేసినందుకు హీరోయిన్ సస్పెండ్..
X

దిశ, సినిమా : తమిళ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ లేటెస్ట్ సోషల్ మీడియా చిట్ చాట్ ఫన్నీగా సాగింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ‘కామిక్ వే’లో సమాధానమిచ్చింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌పై నమ్మకం ఉందా? అని ఓ ఫ్యాన్ ప్రశ్నించగా.. ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు కానీ తను మాత్రం ఫస్ట్ సైట్‌లోనే లవ్‌లో పడిపోయానని తెలిపింది. సూపర్ స్టార్ శింబు తన స్కూల్ టైమ్ క్రష్ అని.. స్కూల్ బంక్ కొట్టి, యూనిఫామ్‌లోనే థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన సందర్భాలున్నాయని తెలిపింది. ఓ అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నానని తెలిసి హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడం కాలేజ్‌లో బెస్ట్ మెమొరీ అన్న ప్రియ.. తెలుగులో త్వరలోనే ఇంట్రడ్యూస్ కాబోతున్నట్లు చెప్పింది. కరోనా ఎండ్ అయ్యాక దీనిపై ప్రకటన ఉంటుందని.. ఇప్పటి వరకు పనిచేసిన బెస్ట్ టీమ్స్‌లో తన ఫేవరెట్ టీమ్ ఇదేనని చెప్పింది. ఇక మాలీవుడ్ హీరోయిన్ పార్వతి తిరువొతుకు వీరాభిమానినని తెలిపిన ప్రియ.. తను నటించిన ‘ఉయరే’ సినిమాకు ఫ్యాన్ అని చెప్పింది. ఇక ఇంటర్నెట్ లేకుండా నెలరోజులు ఉంటావా? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆమె.. నెల కాదు, గతంలో మెంటల్ హెల్త్ కోసం ఆరునెలల పాటు ఇంటర్నెట్, టీవీ లేకుండా ఉన్నానని గుర్తుచేసుకుంది.

Advertisement

Next Story