మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంతే : ప్రియా ఆనంద్

by Shyam |
మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంతే : ప్రియా ఆనంద్
X

నటి ప్రియా ఆనంద్ తెలుగులో ‘180, హరే రామ హరే కృష్ణ’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ చిత్ర సీమలో ఆఫర్లు వెల్లువెత్తడంతో పూర్తిగా కోలీవుడ్ పైనే దృష్టి సారించింది. అయితే ఇప్పుడు ఇద్దరు కోలీవుడ్ హీరోలతో సన్నిహితంగా మెలుగుతోందని.. వారిలో ఒకరిని పెళ్లి కూడా చేసుకోబోతుందని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. దీనిపై క్లారిటీ ఇచ్చింది ప్రియా ఆనంద్.

గడ్డల కొండ గణేష్ సినిమాలో కీలక పాత్రలో నటించిన తమిళ నటుడు అధర్వతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతుందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కడలి హీరో గౌతమ్ కార్తీక్‌తో లవ్‌లో ఉందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో ఈ రూమర్లపై స్పందించింది ప్రియా. అధర్వ, గౌతమ్ ఇద్దరూ కూడా తనకు మంచి స్నేహితులని.. ముగ్గురం కూడా ఇదే స్నేహం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. అంతేకాని ప్రేమ, పెళ్లి లాంటిది ఏమీ లేదని స్పష్టం చేసింది. తనతో పాటు తన స్నేహితులు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది ప్రియా. దీంతో రూమర్లకు బ్రేక్ పడింది.

Advertisement

Next Story