జీతం లేక.. జీవితం వదులుకున్న ప్రైవేట్ టీచర్…

by Shyam |
జీతం లేక.. జీవితం వదులుకున్న ప్రైవేట్ టీచర్…
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఓవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు ఏండ్ల తరబడి ఎక్కిరిస్తోన్న నిరుద్యోగం.. వెరసి ఓ ప్రైవేటు టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా మహమ్మారి కారణంగా ఏడాదికాలంగా ప్రైవేటు స్కూళ్లన్నీ మూతపడ్డాయి. ఫలితంగా ప్రైవేటు టీచర్లు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అయితే ఏడాది కాలంగా ప్రైవేటు టీచర్లకు వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఆ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ ఇబ్బందులు తాళలేక ఇప్పటికే పలువురు ప్రైవేటు టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారు.

తాజాగా నాగార్జునసాగర్ కేంద్రంలోని హిల్ కాలనీలో మంగళవారం ఓ ప్రైవేటు టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హిల్ కాలనీలో నివాసం ఉండే వనెం రవికుమార్(30) ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. రోజురోజూకీ కుటుంబ పోషణ భారం కావడం.. ఆర్థిక ఇబ్బందుల విషయమై సోమవారం రాత్రి భార్యభర్తల మధ్య తగాదాకు దారితీసింది. ఈ క్రమంలోనే భార్య ఇల్లువిడిచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రవికుమార్ మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవికుమార్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed