- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుజరాత్‌లో ఆన్‌లైన్ క్లాసులు బంద్.. ఎందుకంటే..
గాంధీనగర్: గుజరాత్‌లో పాఠశాలలు తిరిగి తెరుచుకునేంత వరకు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రైవేట్ విద్యాసంస్థలు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా ఆన్‌లైన్ క్లాసులను నిలివేస్తున్నట్టు ప్రకటించాయి. కాగా, పాఠశాలలు పున:ప్రారంభం అయ్యేవరకు ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులూ వసూలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం వారం క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు రాగానే ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ సమావేశమైంది. డబ్బులు రానప్పుడు క్లాసులు చెప్పడం ఎందుకంటూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించొద్దని నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధి దీపక్ రాజ్యగురు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ గురువారం నుంచి ఆన్‌లైన్ క్లాసులను నిలిపివేసినట్టు తెలిపారు. ఆన్‌లైన్ విద్య నిజమైనది కాదని ప్రభుత్వం భావిస్తే, ఇక అలాంటి విద్యను అందించడంలో అర్థం లేదన్నారు. ప్రభుత్వం తన ఉత్తర్వులను ఉపసంహరించుకునే వరకు రాష్ట్రంలో ఉన్న సుమారు 15వేల ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించవని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.