- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వహణ లాభం డౌన్
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయ నష్టంతో పాటు పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ లాభాల్లో 35-40 శాతం క్షీణతకు దారితీస్తుందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో నగదు నిర్వహణలో ఉన్న సవాళ్ల మధ్య రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రైవేట్ ఆసుపత్రుల క్రెడిట్ దృక్పథాన్ని స్థిరత్వం నుంచి తగ్గించింది.
ఈ రంగంలో రూ. 36 వేల కోట్లకు పైగా ఆదాయం కలిగిన మొత్తం 40 ఆసుపత్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్టు క్రిసిల్ తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది.
దాదాపు 60 శాతం ఆదాయాన్ని ఇస్తున్న ఎంపిక చేసిన సర్జరీలు, ముందస్తు హెల్త్‌కేర్ చెక్-అప్‌లు తగ్గిపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు ఇబ్బందులొచ్చాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం..28-30 శాతం ఆదాయాన్ని ఇస్తున్న అత్యవసర చికిత్సలు కొనసాగినప్పటికీ, తక్కువగానే నమోదయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తక్కువ ప్రమాదాలు జరగడం, ప్రయాణ ఆంక్షల కారణంగా 10-12 శాతం ఆదాయాన్ని కోల్పోయాయని వివరించింది.