- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్వస్వం దోచుకుంటున్నారు.. కేసీఆర్ చర్యలు తీసుకోరా..?
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పేషెంట్లను ప్రైవేటు ఆసుపత్రులు సర్వస్వం దోచేస్తున్నాయి. చికిత్సల పేరుతో రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే ముందస్తుగా రూ.లక్ష చెల్లించాలని ఆంక్షలు విధిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం డబ్బులు చెల్లించి ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి మందులు, టెస్ట్‌లు, డాక్టర్ ఫీజు, రూం మెంటనెన్స్, ఆక్సిజన్ చార్జీలు, శానిటరీ చార్జీలు ఇలా ఆసుపత్రిలో ఉన్న అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని బిల్లు వేస్తున్నారు. పేషెంట్ చికిత్సకు అవసరం ఉన్నా లేకున్నా అన్ని రకాల చికిత్సలను అందించామని బిల్లులో నమోదు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వరంగల్‌కు చెందిన వ్యక్తి మే 1న కరోనా చికిత్సల కోసం చేరారు.
అడ్మిషన్ చేసుకునేందుకు రూ.లక్ష వసూలు చేశారు. మే 19 వరకు 19 రోజుల పాటు చికత్సలందించి రూ.20,30, 467 బిల్లును నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా కేవలం ఆక్సిజన్ కోసమే రోజుకు రూ.35వేలు చొప్పున రూ.6,30,000 బిల్లు వేశారు. మందుల కోసం ఫార్మసీ బిల్లు రూ.2,15,471 బిల్లును నమోదు చేశారు. పేషెంట్‌ను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు విడుతల వారిగా రూ.9,50,000 బిల్లును చెల్లించారు. అందినకాడికి దోచుకేనేందుకు అలవాటు పడిన ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది 19 రోజులు చికిత్సలందించి పేషెంట్ చనిపోయాడని చావు కబురును తెలియజేశారు.
మిగతా బిల్లు రూ.10,80,467ని చెల్లించి డెడ్ బాడీని తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సర్వస్వం కోల్పోయామని ఆసుపత్రి ఆవరణలో గుండెలు బాదుకున్నారు. ఇలాంటి సంఘంటలను రాష్ట్రంలోని చాలా ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్నాయి. శవాల పైన పేలాలు ఎరుకునేలా ప్రైవేటు ఆసుపత్రులు ప్రవర్తిస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుుపత్రులపై ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది. ఫిర్యాదులందని ఓ కార్పోరేటు ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పనిసరిగా చర్యలు చేపడుతామని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు తెలియజేస్తున్నారు.అయితే, వైద్య, ఆరోగ్య శాఖ ప్రస్తుతం సీఎం కేసీఆర్ వద్దనే ఉండడంతో తగు చర్యలు తీసుకోరా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు.