Private Hospitals Fraud : ఆగని ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. ఆరు లక్షలు కడితేనే మృతదేహం..

by Shyam |   ( Updated:2021-05-27 10:58:19.0  )
Private Hospitals Fraud : ఆగని ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. ఆరు లక్షలు కడితేనే మృతదేహం..
X

దిశ, అంబర్‌పేట్: కరోనా రోగి నుండి లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. బిల్లు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని యాజమాన్యం మొండి చేయడంతో బంధువులు ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు. ఈ సంఘటన బర్కత్‌పుర లోని శాలిని ప్రైవేట్ ఆసుపత్రి ముందు జరిగింది. వెంకటయ్య అనే వ్యక్తి కరోనా సోకడంతో బర్కత్‌పుర లోని శాలిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకోసం ఇప్పటికే మూడు లక్షల రూపాయలు చెల్లించారు. గురువారం వెంకటయ్య ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయాడు.

Corona: కరోనా పేరిట.. ప్రైవేటు ఆసుపత్రుల దందా!

అయితే మరో ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో మృతుడి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. అంత బిల్లు చెల్లించలేమని ఇప్పటికే మూడు లక్షలు చెల్లించామని మృతుని బంధువులు తెలిపారు. కరోనా కు సంబంధించిన చికిత్స చేయకుండా ఆసుపత్రి డాక్టర్ వైద్యులు నిర్లక్ష్యం చేశారని బంధువులు ఆరోపించారు. ఎట్టకేలకు ఆసుపత్రి యాజమాన్యం వెంకటయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement

Next Story

Most Viewed