- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియా నుంచి తప్పించుకున్న ఖైదీ అరెస్ట్
దిశ, ఖైరతాబాద్ : చంచల్‌గూడ జైలులో ఆత్మహత్యకు యత్నించి, ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకున్న ఖైదీని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బంజారా హిల్స్ జహీర్ నగర్ కు చెందిన మహమ్మద్ గౌస్ చోరీలు చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుసార్లు అరెస్ట్ అయి బెయిల్ పొందాడు. తిరిగి గత కొంతకాలం క్రితం ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. పోలీసులు న్యాయస్థానంలో హాజరు పరచి అతని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అప్పటినుంచి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న మహమ్మద్ గౌస్ బుధవారం జైలులో ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న జైలు సిబ్బంది అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. చికిత్సలు కొనసాగుతున్న క్రమంలో అక్కడ పోలీసుల కన్నుగప్పి మహమ్మద్ గౌస్ తప్పించుకున్నాడు. అనంతరం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రిలో గాలించిన అతని ఆచూకీ లభించలేదు. దీంతో అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్ని పోలీస్ స్టేషన్‌లను అప్రమత్తం చేయడంతో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అత్యధికంగా నేరాలు నమోదు కావడం, అతని నివాసం కూడా ఇక్కడే ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అతని కోసం గాలింపు చేపట్టారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.