- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ప్రిన్సెస్ డయానా పెళ్లి గౌను ప్రదర్శన
దిశ, ఫీచర్స్ : రాజకుటుంబానికి చెందిన ప్రిన్సెస్ డయానా గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఓ ట్రెండ్ సెట్టర్. లేటెస్ట్ ఫ్యాషన్‌ను ఆహ్వానించే తాను, వాటిని ధరించేందుకు బ్రిటన్ రాయల్ డ్రెస్ కోడ్ కూడా అతిక్రమించేది. ఇక ఆ మహారాణి ‘పెళ్లి’ గౌను ఇంకెంత ప్రత్యేకమో వేరే చెప్పనక్కర్లేదు. డయానా వెడ్డింగ్ గౌన్ ఫ్యాషన్ డిజైనింగ్‌లోనే సంచలనం. 25 అడుగుల పొడవైన ఆ తెల్ల గౌనులో ఏంజెల్‌లా మెరిసిపోయింది డయానా. తన అభిరుచికి అనుగుణంగా భార్యభర్తలైన డేవిడ్, ఎలిజబెత్ ఇమాన్యుయెల్ అనే ఇద్దరు డిజైనర్‌లు లేడీ డయానా కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఫ్యాషన్ డిజైనర్‌ల పరిభాషలో ‘ఐవరీ సిల్క్ టఫేటా యాంటిక్ లేస్ గౌన్’గా పిలిచే ఆ వస్త్ర విశేషాన్ని 25 సంవత్సరాల తర్వాత లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ విశేషాలు మీకోసం
1981 జూలైలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె పెళ్లి జరిగింది. ఈ వేడుకలోనే ప్రిన్స్ డయానా పదివేల మేలిమి ముత్యాలను పొదిగిన ప్రత్యేక గౌను ధరించింది. దానితో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉండగా, తన పర్సనల్ విషయాలు కూడా ఆ పెళ్లి గౌనుతో రాణి షేర్ చేసుకునేదని ‘డయానా: హర్ ట్రూ స్టోరీ’ రాసిని రచయిత ఓ సందర్భంలో వెల్లడించారు.
రెండేళ్ల క్రితం ‘టైమ్’ మ్యాగజీన్ ‘మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ బ్రిటిష్ రాయల్ వెడ్డింగ్ డ్రసెస్ ఆఫ్ ఆల్ టైమ్’గా డయానా వెడ్డింగ్ గౌన్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆ గౌను డయానా చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ దగ్గర ఉండగా, ప్రస్తుతం డయానా ఐకానిక్ వివాహ దుస్తులను లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ప్రదర్శించనున్నారు. ‘రాయల్ స్టైల్ ఇన్ ది మేకింగ్’ పేరుతో జరగనున్న ఈ ప్రదర్శన 2021 జూన్ 3న ప్రారంభం కానుండగా, 2022 జనవరి2 వరకు కొనసాగుతుంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులు గౌనుకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను, క్లిష్టమైన వివరాలను చూడవచ్చు. దాని స్కూప్డ్ నెక్‌లైన్ నుండి విల్లులతో కత్తిరించిన స్లీవ్‌లు వరకు ప్రతి విషయాన్ని డిటెయిల్‌గా తెలుసుకోవచ్చు. డయానా చనిపోయిన తర్వాత, జూలై 1998 దీన్ని ప్రదర్శించగా, మళ్లీ 23 సంవత్సరాల తర్వాత ఆ బ్రైడల్ గౌన్‌ను ప్రదర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
“ఇన్ని సంవత్సరాల తరువాత పాత స్నేహితుడిని చూసినట్లుగా ఉంది. ఈ రోజు మళ్ళీ అప్పటి చిత్రాలను చూస్తున్నాను, దుస్తులు మీద ఎన్ని సీక్విన్స్ కుట్టామో నేను నమ్మలేకపోతున్నాను. ఇది అద్భుతమైన ప్రదర్శన కానుంది’ అని తన మాజీ భర్త డేవిడ్‌తో కలిసి అద్భుతమైన వివాహ దుస్తులను సృష్టించిన డిజైనర్ ఎలిజబెత్ ఇమాన్యుయేల్ పేర్కొంది.