ఎంఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని ఏరియల్ సర్వే

by Shamantha N |
ఎంఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని ఏరియల్ సర్వే
X

ఎంఫాన్‌ తుపాన్‌ ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను నేడు ప్రధాని మోడీ పరిశీలించనున్నారు. శుక్రవారం పశ్చిమబెంగాల్‌కు చేరుకుని హెలిక్యాప్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న రక్షణ, పునరావాస చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఫాన్ తుపాన్ కారణంగా 84 మంది మృతిచెందారు. దాదాపు 83 రోజుల తర్వాత ఇతర రాష్ర్టాల పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తున్నారు. ఫిబ్రవరి 29న యూపీలోని చిత్రకూట్లలో మోడీ చివరగా పర్యటించారు.

Advertisement

Next Story