- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెన్ స్టోక్స్ సెటైరికల్ స్ట్రోక్స్…
X
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్.. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన ప్రసంగంపై వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. బ్రిటన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదివారం ప్రకటించారు. లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని.. స్కూల్స్, షాపులు జూన్ నుంచి తిరిగి ప్రారంభమవుతాయని బోరిస్ తెలిపారు. అయితే బెన్ స్టోక్స్ .. ప్రధాని చేసిన ఈ ప్రసంగంపై వెటకారంగా స్పందించాడు.
‘‘ప్రధాని చేసిన ప్రసంగం అద్భుతంగా ఉంది. నేను ఓ గదిలో ఉన్నట్లు, ప్రధాని నాతోనే మాట్లాడుతున్నట్లు అని పించింది.’’ అని స్టోక్స్ ట్వీట్ చేశాడు. అయితే నెటిజన్లు.. స్టోక్స్ చేసిన కామెంట్స్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసీర్ హుస్సెన్ ‘నువ్వు అలా చేయాల్సింది కాదు’ అంటూ రీ ట్వీట్ చేశాడు.
Advertisement
Next Story