- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సీరం’ను సందర్శించనున్న ప్రధాని మోడీ
పుణె: పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం సందర్శించనున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ డోసులను సీరం ఉత్పత్తి చేస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ను ప్రధాని మోడీ సందర్శిస్తుండటం ప్రాధాన్యత నెలకొంది. క్లినికల్ ట్రయల్స్ దశలోనే కొవిడ్ వ్యాక్సిన్లను తయారు చేయడానికి దేశవ్యాప్తంగా ఏడు సంస్థలకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతులను మంజూరు చేసింది.
ఇందులో సిరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు ఉత్పత్తి టీకాలు రెండు ఉన్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని, కానీ, పూర్తి షెడ్యూల్ ఇంకా రాలేదని పుణె డివిజల్ కమిషనర్ సౌరభ్ రావు తెలిపారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిస్థితిపై ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీకాను ఎప్పుడు మార్కెట్‌లోకి తీసుకురానున్నారు? ఉత్పత్తి, పంపిణీ యంత్రాంగం గురించి వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నది. అంతేకాకుండా వచ్చే నెల 4న పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌ను 100కుపైగా దేశాల రాయబారులు సందర్శించనున్నారు.