- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందుగా పసిగట్టాం.. మెరుగ్గా ఉన్నాం : ప్రధాని
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. ఇప్పటికే దీని మూలంగా అనేక దేశాలు అతలాకుతలం అయ్యాయి. కాగా మరికొన్ని దేశాల్లో అసలు కరోనా ఊసే లేదు. అయితే భారత్‌తో కరోనా మహమ్మారిని ముందుగా గుర్తించి జాగ్రత్తలు పడటం తీసుకోవడం వల్లనే భారత్ కరోనా విషయంలో మెరుగైన స్థితిలో ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తగా 1300 పరీక్షా కేంద్రాల్లో రోజుకు 5 లక్షల పరీక్షల నిర్వహిస్తున్నామని తెలిపారు. రోజుకు 10 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించేలా పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచుతున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో అధునాతన సదుపాయాలు కలిగిన ల్యాబొరేటరీలను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించామన్నారు. నోయిడా, ముంబై, కోల్‌కతాలో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు.
ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని అత్యాధునిక పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి రావడం కరోనాపై దేశం కొనసాగిస్తున్న పోరుకు మరింత బలం చేకూర్చాయి. వీటి ద్వారా ప్రతి రోజు అదనంగా మరో 10 వేల పరీక్షలు చేయవచ్చు. వీటిలో కరోనా టెస్టుల కోసం మాత్రమే కాకుండా డెంగ్యూ, హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ, సీ వంటి పలు రకాల టెస్టులను నిర్వహిస్తారని ప్రధాని అన్నారు.
వైరస్‌పై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలచుకుందని, పీపీఈ కిట్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. గతంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారు చేయలేదని.. కాన ఈ ఐదు నెలల కాలంలోనే లక్షలాది పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు తయారు చేసిందని అన్నారు. కాగా దేశంలో యాక్టివ్ కేసుల కంటే… రికవరీ కేసులే ఎక్కువగా ఉండటం వల్ల దేశంలో రోజువారీ ఎన్ని కేసులు నమోదవుతున్నా… కరోనా కట్టడిలో భారత్ మెరుగ్గానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.