ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

by Anukaran |   ( Updated:2021-12-12 02:39:17.0  )
modi
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయానికి సంబంధించిన పీఎంఓ ఇండియా తన ట్విట్టర్‌ లో తెలిపింది. బిట్ కాయిన్‌ను ప్రభుత్వం అధికారికం చేసిందని, దేశంలోని ప్రతిఒక్కరికీ 500 కాయిన్ల చొప్పున పంచుతుందని హ్యాకర్లు ఒక పోస్టు పెట్టారు. కాసేపటికే ట్వీట్‌ను డిలీట్ చేయగా.. అప్పటికే పోస్టుకు సంబంధించిన స్క్రీన్‌షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దీనిని ట్విట్టర్ అధికారుల దృష్టికి పీఎంఓ కార్యాలయం తీసుకెళ్లగా.. వెంటనే పునరుద్దరించారు. హ్యాక్ అయిన సమయంలో చేసిన ట్వీట్స్‌ను పట్టించుకోవద్దని పీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది.

Advertisement

Next Story