వందేళ్లు కొలువుదీరేలా కొత్త పార్లమెంట్ : ప్రధాని

by Anukaran |
వందేళ్లు కొలువుదీరేలా కొత్త పార్లమెంట్ : ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో గురువారం నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం జరుగుతోంది. సర్వమత ప్రార్థనలతో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంటు త్వరలో సరికొత్త భవనంలో కొలువుదీరబోతోందని అన్నారు. వచ్చే వందేళ్ల అవసరాలకు సరిపోయేలా ‘సెంట్రల్ విస్టా’ పేరుతో నిర్మిస్తున్నామన్నారు. అంతేగాకుందా 75 ఏళ్ల స్వాతంత్య్రానికి గుర్తుగా కొత్త భవనం నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం నాలుగు అంతస్తుల్లో, మొత్తం 64,500 చదరపు మీటర్ల వైశాల్యాంతో, సుమారు రూ. 971 కోట్ల అంచనాలతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ పార్లమెంటులోని లోక్ సభలో ప్రస్తుతం 888 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా, భవిష్యత్తులో మొత్తం 1,224 సభ్యులు కూర్చునేలా ఈ నిర్మాణం జరగనుందని అన్నారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునేలా, భవిష్యత్తులో సభ్యుల సంఖ్య పెరిగినా వారికి కూడా సరిపోయేలా హాల్‌ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. దేశ ప్రజలందరూ కలిసి నిర్మించుకుంటున్న భవనమిది అన్నారు. కొత్త భవనం భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని తెలిపారు. అండర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 20 మంత్రుల కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. నెమలి పురివిప్పిన రూపంలో లోక్ సభ పై కప్పు నిర్మాణం జరుగనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed