- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి చేస్తూ పురోహితుడి పాడు పని.. మండపంలోనే అలా..!
దిశ, వెబ్‌డెస్క్ : వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేయాల్సిన పురోహితుడు.. అగ్ని సాక్షిగా వధువు పుస్తెల తాడును చోరీ చేశాడు. పెళ్లి కూతురు మెడకు చేరకముందే పురోహితుడు వేద మంత్రాలను ఉచ్ఛరిస్తూ మూడు తులాల బంగారు గొలసును తస్కరించాడు. మెదక్ జిల్లా తుప్రాన్ లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..
ఈనెల 16 తుప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాలపల్లికి చెందిన జ్ఞానసుందర్ దాస్‌కు నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతకు వివాహం అయింది. ఈ పెళ్లి నిర్వహించేందుకు గజ్వేల్‌కు చెందిన పురోహితుడిని మాట్లాడుకున్నారు. అయితే పెళ్లి తంతును ప్రారంభించిన పురోహితుడి దృష్టి వధూవరులకు పసుపు,కుంకుమల కింద పెట్టే బంగారు వస్తువులపై పడింది. ఓ వైపు వివాహం జరిపిస్తూనే.. మరోవైపు రూ.1.50 విలువైన మూడు తులాల పుస్తెల తాడును తస్కరించాడు.కాగా, పురోహితుడు ఆ చైన్ ను దొంగిలిస్తున్న వీడియో పెళ్లిని చిత్రీకరిస్తున్న ఫోటో గ్రాఫర్ బంధించాడు.
వరుడు, వధువు మెడలో తాళి కట్టిన అనంతరం పురోహితుడు కంగారు పడుతూ పెళ్లి తంతును పూర్తి చేయకుండనే వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిన తర్వాత బంగారు వస్తువులను పరిశీలించగా.. వధువు పుస్తెల తాడు కనిపించలేదు. పురోహితుడిపై అనుమానంతో అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో గజ్వేల్‌లోని ఆయన ఇంటికి వెళ్లి వాకాబు చేయగా ఆయన తల్లి పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. పెళ్లి వీడియోలోనూ పురోహితుడు దొంగతనం స్పష్టంగా కనిపిస్తుండడంతో జ్ఞానసుందర్ దాస్ తల్లిదండ్రులు మునిరాతి పెంటయ్య, సుశీల తుప్రాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.