ఎంటైర్ సిస్టమ్‌ను శాసిస్తున్న మాఫియా.. ‘కార్టెల్’ సిరీస్‌పై ప్రశంసలు

by Anukaran |
ఎంటైర్ సిస్టమ్‌ను శాసిస్తున్న మాఫియా.. ‘కార్టెల్’ సిరీస్‌పై ప్రశంసలు
X

దిశ, సినిమా : బెగ్గర్స్ రాకెట్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ వరకు.. సినిమా ఇండస్ట్రీ నుంచి క్రికెట్ బెట్టింగ్ వరకు.. ఆయుధాల రవాణా నుంచి కాంట్రాక్ట్ హత్యల వరకు.. ప్రతీది అండర్ వరల్డ్ మాఫియా గ్యాంగ్ కంట్రోల్‌లోనే ఉంటుంది. పొలిటికల్, జ్యుడిషియల్, కార్పొరేట్ ఆర్గనైజేషన్స్‌ సైతం అండర్ వరల్డ్ కనుసన్నల్లో మూవ్ అవుతాయి. ఒక కాంట్రాక్ట్ ఓకే కావాలన్నా, ఒకరిని భూమ్మీద నుంచి తప్పించాలన్నా ఫైనల్ డెసిషన్ మాఫియాదే. కానీ అలాంటి గ్యాంగ్‌లో ఇన్నర్ వార్ జరిగితే.. డాన్‌ ప్లేస్‌ను మరొకరు ఆక్రమించాలనుకుంటే.. టార్గెట్ చేసిన వాడు చావాలి లేదా టార్గెట్‌ చేయబడినవాడు చంపబడాలి.

అయితే, అప్పటిదాకా.. ‘జనం వరుస హత్యలకు సాక్ష్యంగా నిలవాల్సిందే! మీడియా 24 గంటలు పని చేయాల్సిందే! రాజకీయ వ్యవస్థ, సినిమా రంగం, క్రికెట్ షెడ్యూల్స్.. ఇలా ప్రతీ ఒక్కటి హాల్ట్ అయిపోవాల్సిందే!’ ఇలాంటి గ్యాంగ్ వార్ సాగాను గ్రిప్పింగ్‌గా ప్రజెంట్ చేసిన ALTBalaji’s ‘కార్టెల్’.. ది బెస్ట్ సిరీస్‌గా ప్రశంసలు అందుకుంటోంది. డాన్‌ అనేవాడు కేవలం వారసత్వాన్ని ఎంకరేజ్ చేయకుండా సత్తా ఉన్నోడినే ‘గ్యాంగ్ లీడర్‌’గా ప్రకటించాలన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘కార్టెల్’ వ్యవస్థలోని లోపాలు, ఒక సిస్టమ్ మరో సిస్టమ్‌కు ఉన్న రిలేషన్‌షిప్, పొందుతున్న బెనిఫిట్స్ గురించి బ్రాడ్ వేలో ఎలివేట్ చేసింది.

స్టోరీ- 360 డిగ్రీస్ అప్రోచ్..

15 ఏళ్లుగా ఆంగ్రే గ్యాంగ్ లీడర్ రాణి మాయి ముంబై సిటీలో అండర్ వరల్డ్ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిగా వెలుగొందుతుంటుంది. ఐదుగురు గ్యాంగ్‌స్టర్స్‌తో కూడిన మాఫియా క్లబ్‌లో ఒకరి ఇల్లీగల్ బిజినెస్‌కు మరొకరు అడ్డురాకుండా సెపరేట్ జోన్స్‌ను అప్పగించేస్తుంది. దీంతో ఎలాంటి గ్యాంగ్ వార్స్‌కు తావులేకుండా ఎవరి పని వారు కానిచ్చేస్తూ సొసైటీలో బడా బాబులుగా చెలామణి అవుతుంటారు. ‘అన్న’ టాక్సీ అండ్ ఆటో యూనియన్ కంట్రోలర్ కాగా.. ‘గజరాజ్’ బెగ్గింగ్ రాకెట్.. ‘చైర్మన్’ బాలీవుడ్ అండ్ క్రికెట్ స్కామ్స్.. ‘ఖాన్’ స్మగ్లింగ్ అండ్ డ్రగ్స్ రాకెట్ దందా నడుపుతుంటారు.

వీరందరినీ కంట్రోల్ చేస్తూ సిటీని తన గుప్పిట్లో ఉంచుకున్న రాణి మాయి.. తన సొంత కొడుకు అభయ్ అయినా సరే అల్లుడు మేజర్ అర్జున్, మధుపైనే ఆధారపడుతుంది. ఈ క్రమంలోనే రాణి మాయిపై అటాక్ జరగ్గా.. అభయ్, అర్జున్, మధులు దీని వెనుక ఎవరి హస్తం ఉందో కనుక్కునే పనిలో పడతారు. ఈ టైమ్‌లోనే రాణి మాయి స్థానంలో ఉండి ఈ వ్యవహారాలను డీల్ చేసేదెవరనే టాపిక్ రాగా, గ్యాంగ్‌స్టర్స్ అందరూ అర్జున్‌కు ఓటేస్తారు. కానీ దీన్ని ఖండించిన అభయ్.. రాణి మాయి కొడుకును తానే కాబట్టి ఆంగ్రే గ్యాంగ్‌ నెక్స్ట్ లీడర్‌ కూడా తనే అని వాదిస్తాడు.

కానీ దీన్ని అందరూ తిరస్కరించడంతో అర్జున్ కావాలనే ఇదంతా చేస్తున్నాడని, తన ప్లేస్‌ను రీప్లేస్ చేసేందుకు ట్రై చేస్తున్నాడని పగ పెంచుకుంటాడు. అతన్ని చంపి సింహాసనాన్ని అధిష్టించాలని అనుకుంటాడు. ఆ టైమ్‌లో అగ్నికి ఆజ్యం పోసినట్లు తనను తప్పుదారి పట్టించిందెవరు..? తనకు సపోర్ట్ చేసిందెవరు..? రాణి మాయిపై అటాక్‌కు తనకు ఉన్న సంబంధం ఏంటి? రాణి సైతం సొంత కొడుకును చంపేందుకు ఎందుకు వెనుకాడలేదు? అనేది కథ.

ఇండస్ట్రీ – క్రికెట్ – మాఫియా సంబంధాలు

ఆంగ్రే ఫ్యామిలీ బిజినెస్ మాఫియానే కాగా, ఎమోషనల్ యాంగిల్స్ కూడా టచ్ చేసిన మేకర్స్.. ప్రతీ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆంగ్రే కుటుంబంలో రాణి మాయికి అభయ్‌తో పాటు సుమి అనే కూతురు ఉండగా.. తను హీరోయిన్‌గా మారాలని అనుకుంటుంది. ఈ క్రమంలో చైర్మన్ నిర్మిస్తున్న మూవీకి ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమాలో ఎలాగైనా ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ సంపాదించాలనుకున్న మరో అమ్మాయి చైర్మన్‌ను అప్రోచ్ అవుతుంది. తనకు, టీమిండియా వైస్ కెప్టెన్‌కు గల సెక్సువల్ రిలేషన్‌షిప్ వీడియోను చూపించి ఆ క్యారెక్టర్‌ను కొట్టేస్తుంది.

ఈ క్లిపింగ్‌ను యూజ్ చేసిన చైర్మన్.. వైస్ కెప్టెన్‌ను క్రికెట్ స్కామ్‌లకు వాడుకుంటాడు. తను చెప్పినట్లుగానే ఆడాలని ఫోర్స్ చేస్తాడు. అయితే మూవీ చాన్స్ మిస్ అయిందని తెలుసుకున్న సుమి సూసైడ్ అటెంప్ట్ చేయగా.. అర్జున్, మధు చైర్మన్‌ను బెదిరించడం, క్యారెక్టర్ మళ్లీ తనకే వచ్చేలా చేయడం జరిగిపోతాయి. ఈ క్రమంలో సుమికి దగ్గరైన వైస్ కెప్టెన్ ఎలాంటి గేమ్ ప్లే చేశాడు? చైర్మన్ చేతి నుంచి ఎలా జారుకున్నాడు? అనే ఎపిసోడ్ సినిమా – క్రికెట్ – మాఫియాకు మధ్య ఉన్న సంబంధాన్ని ఫెయిర్‌గా చూపించింది.

పాలిటిక్స్ – బిజినెస్‌మెన్ – మీడియా – మాఫియా

ఆంగ్రే ఫ్యామిలీ బిజినెస్‌ను హేట్ చేసి కుటుంబానికి దూరంగా వెళ్లిపోయిన అర్జున్ సోదరి శ్వేత.. సోషల్ యాక్టివిస్ట్‌ రాఘవ్‌తో ప్రేమలో పడుతుంది. అతను స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతిని బయటపెడుతూ మీడియా, సోషల్ మీడియాలో ఫేమస్ కాగా ఆంగ్రే ఫ్యామిలీని మట్టుబెట్టాలనే ఆలోచనలో ఉన్న బిజినెస్‌మన్ డోరబ్జీ.. రాఘవ్ ఎమ్మెల్యే అయ్యేందుకు సపోర్ట్ చేస్తాడు.

ఇందుకోసం మీడియాను కూడా వాడుకున్న డోరబ్జీ, ఆ యాంకర్‌ను ఎందుకు చంపేశాడు? అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఎదిగిన రాఘవ్‌ను గెలిచాక పదవి ఎరవేసి అదే పార్టీలో ఎందుకు చేరమన్నాడు? ఆంగ్రే ఫ్యామిలీ(మాఫియా)ని అసహ్యించుకునే సోషల్ యాక్టివిస్ట్ రాఘవ్.. డోరబ్జీ మాయలో పడిపోయి ఏం చేశాడు? అనే కోణాన్ని చూపించిన మేకర్స్.. వాల్యూస్, ఎథిక్స్ అని మాట్లాడుతూ నాయకుడిగా ఎదిగిన ప్రతీఒక్కరు పదవి ఆశచూపగానే ఇవన్నీ మరిచిపోతారనే మెసేజ్ ఇచ్చారు.

వల – నమ్మక ద్రోహం

బిజినెస్‌మెన్ డోరబ్జీ తను ఎదిగేందుకు అభయ్‌ను మాయ అనే మత్తులో పడేసి, అప్పటికే అర్జున్ మీద ఉన్న కోపాన్ని రెట్టింపు చేసి ప్రతీకారం తీర్చుకునేలా ప్లాన్ చేస్తాడు. ఆంగ్రే గ్యాంగ్ లీడర్ అభయ్ అనే ఒక్క మాటను యూజ్ చేస్తూ సొంతగా ఆలోచించే విచక్షణా జ్ఞానం లేకుండా అభయ్‌ను మార్చేసిన డోరబ్జీ.. తనను ఆంగ్రే ఫ్యామిలీకి ఎనిమీగా ఎలా మార్చాడు? ఎందుకు మార్చాడు? డోరబ్జీ ప్లాన్‌కు రాణి మాయి అటాక్‌కు ఉన్న సంబంధం ఏంటి? మాఫియా, గ్యాంగ్‌స్టర్స్, గవర్నమెంట్.. బిజినెస్‌మెన్ తెలివితేటల ముందు పనికిరాకుండా పోతాయా? అనే రియలిస్టిక్ స్టోరీని సక్సెస్‌ఫుల్‌గా ప్రజెంట్ చేశారు మేకర్స్.

– సుజిత రాచపల్లి

Advertisement

Next Story

Most Viewed