- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మలేరియా నివారణ చర్యలను ప్రారంభించాలి
దిశ, న్యూస్‌బ్యూరో: త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధుల నివారణకు ఇప్పట్నుంచే క్రిమిసంహారక స్ర్పేయింగ్‌కు సిద్ధం కావాలని జీహెచ్ఎంసీ శానిటేషన్ అదనపు కమిషనర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ఆయన ఎంటమాలజి విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని నగరంలోని అన్ని ప్రాంతాల్లో స్ర్పే చేస్తున్నట్లు వివరించారు. చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు, లార్వా పై డ్రోన్ల ద్వారా క్రిమీసంహారకాలు స్ప్రే చేయడం, ఫాగింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. యాంటిలార్వా ఆపరేషన్‌పై ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, శానిటేషన్ జాయింట్ కమిషనర్ సంధ్య పాల్గొన్నారు.
tags: Lockdown, GHMC, entomology, malaria, Rahul Raj