గవర్నర్ తమిళసైకు ప్రతిష్టాత్మక అవార్డు..

by Shyam |   ( Updated:2021-03-04 08:53:28.0  )
గవర్నర్ తమిళసైకు ప్రతిష్టాత్మక అవార్డు..
X

దిశ వెబ్ డెస్క్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు తమిళసైను వరించింది. యూఎస్ కాంగ్రెస్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారు అందించే ఈ అవార్డుకు డా. తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు.

గవర్నర్ తమిళసైతో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా. తమిళిసై సౌందరరాజన్‌ను ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.

Advertisement

Next Story

Most Viewed