రామాలయ నిర్మాణానికి రాష్ట్రపతి విరాళం

by Shamantha N |
రామాలయ నిర్మాణానికి రాష్ట్రపతి విరాళం
X

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామ మందిరానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రూ. 5,01,000లను విరాళంగా అందించారు. రామ మందిర నిర్మాణ బాధ్యతలు, మేనేజ్‌మెంట్ పర్యవేక్షిస్తున్న రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఈ మొత్తాన్ని చెక్ రూపంలో అందజేశారు. రామ మందిర నిర్మాణానికి ఇచ్చిన తొలి విరాళం ఇదే. విశ్వ హిందు పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్, రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్‌గిరి, ఇతర సభ్యుల ప్రతినిధుల బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను విరాళం అడిగారు. ‘రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దేశానికి ప్రథమ పౌరుడు. అందుకే ఆయన నుంచే విరాళాల సేకరణ ప్రారంభించాలనుకున్నాం. ఆయన రూ. 5,01,000ల చెక్ అందజేశారు’ అని అలోక్ కుమార్ తెలిపారు. వీహెచ్‌పీ, ఇతర సంస్థలు రామ మందిర నిర్మాణానికి విరాళాల సేకరణను ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది.

Advertisement

Next Story

Most Viewed