మహత్ముడికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోడీ

by Anukaran |
మహత్ముడికి నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్ : నేడు జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు.. వారి సమాధుల వద్ద నివాళులు అర్పించారు. శనివారం ఉదయం రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌ వద్ద రామ్‌నాథ్ కోవింద్, మోడీ, సోనియా గాంధీ పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గాంధీ, శాస్త్రి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి జయంతి ఉత్సవాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లాల్ బహదూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రి కూడా పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed