- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
20న హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. బొల్లారంలో శీతాకాల విడిది
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈనెల 20వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసేందుకు ఆయన వస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడడంతో తెలంగాణ అధికారులు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. ఏర్పాట్లపై కంటోన్మెంట్, జీహెచ్‌ఎంసీ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయంలో రామ్‌నాథ్ కోవింద్ నాలుగైదు రోజుల పాటు బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో దిండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో బొల్లారం చేరుకుంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ప్రోటోకాల్ విభాగం చేపట్టింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కాగా ఆయన పదవీకాలం వచ్చే ఏడాదితో ముగియనుండటంతో ఇదే చివరి శీతాకాల విడిది కానుంది.