శ్వేత జాత్యహంకారం ఉగ్రవాదమే.. అమెరికాకు బలమైన ముప్పు

by Shamantha N |   ( Updated:2021-04-29 03:08:55.0  )
శ్వేత జాత్యహంకారం ఉగ్రవాదమే.. అమెరికాకు బలమైన ముప్పు
X

వాషింగ్టన్: శ్వేత జాత్యహంకారం ఉగ్రవాదమని, అదే దేశానికి బలమైన ముప్పు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అందుకే అమెరికా నిరంతరం జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికన్ కాంగ్రెస్‌లో ఉభయసభలనుద్దేశించి అధ్యక్షుడు బైడెన్ బుధవారం తొలిసారిగా మాట్లాడారు. తన ప్రసంగంలో అఫ్ఘనిస్తాన్ నుంచి బలగాల ఉపసంహరణపై ఆయన మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా ఉగ్రవాద నెట్‌వర్క్‌ అఫ్ఘనిస్తాన్ నుంచి చాలా విశాలంగా విస్తరించిందని తెలిపారు. విదేశీ ఉగ్రవాద ముప్పు కంటే దేశంలోనే జాత్యహంకార ఉగ్రవాదులతో ప్రమాదం ఎక్కువగా ఉన్నదని వివరించారు. అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టును విస్మరించబోమని, శ్వేతజాతి అహంకారం ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముప్పు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్యాపిటల్‌పై కొందరు ట్రంప్ మద్దతుదారుల దాడిని ఆయన ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికే ఆ ఘటన ఒక సవాల్ విసిరిందని, ఆ పరీక్షను అమెరికా ప్రజాస్వామ్యం విజయవంతంగా ఎదుర్కొందని తెలిపారు. అయితే, ఈ జాఢ్యంపై పోరు ఇప్పుడే ముగిసిపోలేదన్నారు.

Advertisement

Next Story