‘దిశ’ కథనం పై కదిలిన అఖిలపక్ష నాయకులు

by Sridhar Babu |   ( Updated:2021-10-30 03:57:51.0  )
‘దిశ’ కథనం పై కదిలిన అఖిలపక్ష నాయకులు
X

దిశ, ఖమ్మం రూరల్​ : రూరల్​ మండలం తెల్దారుపల్లి గ్రామంలో ‘బృహత్​ పల్లె పకృతి వనం’ మాటున చేస్తున్నమట్టి దందా పై ‘దిశ’ దినపత్రికలో శనివారం ‘బృహత్​ మట్టి మాయ’ అనే శీర్షికను ప్రచురించింది. దిశ కథనానికి స్పందించిన రూరల్ మండల అఖిలపక్ష నాయకులు శనివారం మట్టి దందా చేస్తున్న ప్రతిపాదిత పార్కు స్థలాన్ని పరిశీలించారు. పార్క్​ పేరుతో మట్టిదందా చేస్తున్న కొంతమంది అధికార పార్టీ నాయకులు వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దీని పై మంత్రి, ఎమ్మెల్యే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. పరిశీలనకు వచ్చిన నాయకుల పై కేసులు పెట్టడం దారుణం అని విమర్శించారు. మట్టిదందాను అడ్డుకోవాల్సిన క్రామెడ్స్​ అండగా ఉండటం సరైందని కాదని వారు తెలిపారు.

జిల్లా అధికారులు ఇప్పటికైన స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని, లేకపోతే మండలంలోని అన్ని పార్టీల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్​కు సమస్యను విన్నవివస్తామన్నారు. అవసరమైతే నిరసన దీక్షలు కూడ చేస్తామని హెచ్చరించారు. ముడుపుల కోసం మట్టి తవ్వకాలను చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టీఆర్ఎస్​ నాయకులు తమ్మినేని క్రిష్ణయ్య, ఎంపీటీసీ మంగతాయి, బండి జగదీష్​, మద్ది మల్లారెడ్డి, తేజావత్​ పంతులు, రమేష్​, సురేష్​, కాంగ్రెస్​​ నాయకులు కళ్లెం వెంకటరెడ్డి, యరసాని శివశంకర్​రెడ్డి, నాగండ్ల శ్రీనివాస్​రావు, వీరారెడ్డి, అంబేద్కర్​, విజయ్​, బండి వినోద్​, సీపీఐ నాయకులు దండి సురేష్​, పుచ్చకాయల సుధాకర్​, రంగరావు, ఎన్డీ నాయకులు, గ్రామస్థులు ఉన్నారు.

బృహత్​ మట్టి మాయం పై ఇంటిలిజెన్స్​ ఆరా..
దిశలో వచ్చిన బృహత్​ మట్టి మాయం కథనం పై ఇంటిలిజెన్స్​ అధికారులు ఆరా తీశారు. అసలు దిశలో వచ్చిన కథనం ఎంత వరకు నిజమని, అక్రమ మట్టి రవాణాలో సూత్రదారులు, పాత్రదారలేవ్వరని ఆరా తీసినట్లు తెలిసింది. వాస్తవాలను జిల్లా ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed