- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గడిచిన 24 గంటల్లో 357 మంది మృతి
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన వారం రోజులుగా దేశంలో వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మృతిచెందుతున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 357 మంది చనిపోయారు. దేశంలో కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి దాని బారిన పడి ఒకే రోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 8102కు చేరింది. అదేవిధంగా 9,996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,579 కు చేరుకుంది. ఇందులో 1,41,029 మంది కోలుకున్నారు. 1,37,448 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల జాబితాలో భారత్.. కెనడాను దాటి 11వ స్థానానికి చేరింది. ఇక అత్యధిక కేసుల జాబితాలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతున్నది.