- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ కేసులో ఛార్జ్ షీట్ సిద్ధం
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఛార్జ్ షీట్ ని సిద్ధం చేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుండి 197 మొబైల్ యాప్స్ ద్వారా నిందితులు పెద్ద ఎత్తున రుణాలను ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. దేశంలోని పలు నగరాల్లో లోన్‌యాప్స్ నిర్వహకులపై పోలీసులు దాడి చేసి ఇప్పటివరకు 20 మంది నిర్వహకులను అరెస్ట్ చేశారు.
ఢిల్లీలో ఆరుగురు, హైదరాబాద్లో ఆరుగురు, బెంగుళూరులో ఏడుగురు, కర్నూల్లో ఒకరిని అరెస్ట్ చేశారు.చైనా నుండే ప్రధానంగా ఈ లోన్ యాప్స్ కార్యక్రమాలను నిర్వహించినట్టుగా గుర్తించారు.ఈ కేసు లో ప్రధాన నిందితుడిగా లాంబో అనే వ్యక్తిని గుర్తించారు. ఇండియాలో జెన్నిఫర్ ద్వారా కార్యకలాపాలను లాంబో నిర్వహించేవాడని పోలీసులు స్పష్టం చేశారు. అమాయక నిరోద్యోగులను ఉద్యోగుల పేరిట లోన్స్ ఇప్పస్తామని మోసం చేసేవారని, డబ్బు తిరిగి చెల్లించని పక్షంలో వారిపై అమానుషంగా ప్రవర్తించేవారని పోలీసులు తెలిపారు. ఈ కేసు కు సంబంధించిన ఛార్జ్ షీటు ను బుధవారం పోలీసులు దాఖలు చేయనున్నారు.