రెండు సినిమాలతో ఇషా రీఎంట్రీ

by Shyam |
రెండు సినిమాలతో ఇషా రీఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కావాలి. కారాణాలు ఏవైనా.. ఒక్కసారి అవకాశాలు తగ్గుముఖంపడితే? ఇక అంతే సంగతులు. కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడ్డట్లే. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది నిజం కాగా, అప్పుడప్పుడు ఇలాంటి భావనలు తప్పని నిరూపిస్తూ పలువురు హీరోయిన్లు కమ్ బ్యాక్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోయిన్ ఇషా చావ్లా రెండు కొత్త సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

ఆది సాయి కుమార్ హీరోగా వచ్చిన ‘ప్రేమ కావాలి’ మూవీతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఇషా చావ్లా.. సునీల్‌‌తో ‘పూలరంగడు’, బాలయ్యతో ‘శ్రీమన్నారాయణ’ సినిమాలు చేసింది. ఆ తర్వాత మరో 2, 3 సినిమాల్లో కనిపించి, సిల్వర్ స్క్రీన్‌కు దూరమైంది. అయితే లేటెస్ట్‌గా ఓ ప్రముఖ చానల్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపిన ఇషా.. తెలుగులో రెండు సినిమాలకు కూడా కమిట్ అయినట్లు తెలిపింది. ‘తెలుగు ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకైతే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. నేను చేయబోయే షో వివరాలతో పాటు సినిమా విశేషాలు త్వరలోనే మీతో పంచుకుంటాను’ అని తెలిపింది ఇషా.

Advertisement

Next Story

Most Viewed