- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రుల పర్యటన.. టెన్షన్‌లో పోలీసులు
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతల కోసం పోలీసుల వేట మొదలైంది. బుధవారం నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరవుతున్న నేపథ్యంలో.. ప్రతిపక్షాల నాయకులు వారిని అడ్డుకునేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మంత్రులను నియోజకవర్గంలో పెద్దఎత్తున అడ్డుకుంటున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో మంత్రుల పర్యటనను అడ్డుకోకుండా చూసేందుకు పోలీసులు శ్రమించాల్సి వస్తుంది. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను చౌదరిగూడ మండలాల్లో అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి.
అదేవిధంగా ఏకంగా మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో షాద్ నగర్ నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లలో మంత్రుల పర్యటనలు ఉన్నప్పుడు టెన్షన్ నెలకొంటుంది. ఏ వైపు నుండి ఎవరు అడ్డుకుంటారో తెలియక పోలీసులు శ్రమిస్తున్నారు.