- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రీతీ జింటా కరోనా టెస్ట్ @21
దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న సొట్టబుగ్గల సుందరి ప్రీతిజింటా.. సినిమా లైఫ్ నుంచి వ్యాపారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు సహ యజమానిగా తనవంతు ప్రోత్సాహం అందిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఐపీఎల్ దుబాయిలో నిర్వహిస్తుండగా.. దాదాపు లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యేదశకు చేరుకున్నాయి. అయితే. జట్టుతో పాటే దుబాయిలో ఉంటున్న ప్రీతి.. అందరితో పాటు తాను కూడా కరోనా టెస్ట్‌లు చేయించుకున్నట్లు తెలిపింది.
దుబాయిలోని బయో బబుల్‌లో క్రికెటర్లతో పాటు ప్రీతి కూడా ఉంటున్న విషయం తెలిసిందే. బయో బబుల్ రూల్స్ ప్రకారం బయటి వారినెవరినీ కలవకుండా జాగ్రత్తగా ఉంటూనే ఎప్పటికప్పుడు కరోనా టెస్ట్‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. బయటకు వెళ్లకుండా కేవలం హోటల్ గది లేదంటే స్టేడియంలో మాత్రమే ఉండాలి. ప్రీతి ఈ రూల్స్ అన్నీ పాటిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఇక్కడ మెడికల్ రూమ్ ముందు కరోనా పరీక్షల కోసం నిలబడితే.. నాకు కాలేజీ రోజుల్లో పరీక్షా ఫలితాల కోసం వెయిట్ చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ నర్సుకు కృతజ్ఞతలు.. ఆ మ్యాజిక్ హ్యాండ్స్, స్వాబ్ టెస్ట్ పెయిన్‌ను మరిపించేలా చేస్తున్నాయి. ఒకే గదిలో ఉంటూ నాలుగు రోజులకు ఒకసారి కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఇప్పటి వరకు 21సార్లు పరీక్ష చేయించుకున్నాను’ అంటూ తన ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది ప్రీతి.