- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
108లో పురిటి నొప్పులు.. ప్రాణాలకు తెగించిన అంబులెన్స్ సిబ్బంది..!
దిశ, మానకొండూరు : ఉమ్మడి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని 108 వాహన సిబ్బంది అంబులెన్సులోనే గర్భిణీ మహిళకు వైద్య చికిత్సలు చేసి నార్మల్ డెలివరీ చేశారు. ఈ సందర్భంగా ఈఎన్‌టీ గూడూరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. శనివారం తెల్లవారు జామున కేశవపట్నం గ్రామానికి చెందిన గోదారి మమత అనే గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వచ్చాయి. 108 నెంబర్‌కు కాల్ రావడంతో కేశవపట్నం 108 సిబ్బంది మమత ఇంటికి చేరుకుని మెరుగైన వైద్య చికిత్స కోసం కరీంనగర్‌లోని మాతాశిశు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
వాహనం రన్నింగ్‌లో ఉండగా మమతకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఈఎన్‌టీ సతీష్ రెడ్డి, వైద్య సేవలు అందించి 108 వాహనంలోనే నార్మల్ డెలివరీ చేసినట్టు తెలిపారు. పుట్టిన బిడ్డ, తల్లి క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 108 వాహన ఈఎన్టీ గూడూరి సతీష్ రెడ్డి, వాహన పైలెట్ గోపికృష్ణ, మమత కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.