అంబులెన్స్‌లోనే గర్భిణీ ప్రసవం

by srinivas |
అంబులెన్స్‌లోనే గర్భిణీ ప్రసవం
X

దిశ, ఏపీ బ్యూరో: విజయనగరం జిల్లాలో మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అంబులెన్స్‌ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం గంగాడ గ్రామానికి చెందిన భవాని (23) పురిటినొప్పులతో బాధపడుతుందని కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన తాము అంబులెన్స్‌లో ఘటనా స్థలానికి వచ్చి గర్భిణీని రాజాం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలో వణుకూరు గ్రామం వద్ద అంబులెన్స్‌లోనే ప్రసవించిందని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.

శిశువు మెడచుట్టూ అంబులికల్‌ కార్డు ఉండటం వల్ల ప్రసవం కష్టమైనట్లు తెలిపారు. అనంతరం కష్టపడి వైద్యం చేయడంతో కాన్పు అయినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, తల్లీబిడ్డ ఇద్దరూ రాజాం ఏరియా హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్నట్లు 108 సిబ్బంది స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed