- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డుపైనే ప్రసవం.. రెండు గంటలూ అక్కడే
దిశ, నల్లగొండ: ఓ గర్భిణిని ప్రయివేటు వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా పాన్‌గల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన జ్యోతికి తెల్లవారుజామున పురిటి నొప్పులు వచ్చాయి. సమయానికి 108, 102 వాహనాలు అందుబాటులో లేవు. దీంతో ప్రయివేటు వాహనంలోనే మండల కేంద్రంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా.. నొప్పులు తీవ్రతరమై పాన్‌గల్ శివారులో రహదారిపైనే ప్రసవించింది. అనంతరం స్పృహ తప్పిపోయింది.
ఇదిలా ఉండగా, ప్రసవం కోసం జ్యోతి ఆస్పత్రికి వెళ్లిందన్న సమాచారంతో తండాకు చెందిన ఆశా కార్యకర్త చంద్రమ్మ.. ద్విచక్రవాహనంపై వస్తుండగా, కేతేపల్లి సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. తలకు బలమైన గాయం కావడంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ కారణంగా ఆశ కార్యకర్త నుంచి అధికారులకు సమాచారం వెళ్లకపోవటంతో రెండు గంటల పాటు జ్యోతి రోడ్డు పక్కనే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత పాన్‌గల్‌కు చెందిన ఆశా కార్యకర్తలు రేణుక, లక్ష్మి వచ్చి ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అందించడంలో ఇంకా ఆలస్యమైతే ప్రమాదం జరిగి ఉండేదని పాన్‌గల్ పీహెచ్‌సీ వైద్యాధికారి రాముడు తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగానే ఉన్నట్టు ఆయన తెలిపారు.
Tags : Pregnancy, delivery, road,108,102, roed accident, health staff