తుడుం దెబ్బ నేతల ముందస్తు అరెస్ట్

by Aamani |
తుడుం దెబ్బ నేతల ముందస్తు అరెస్ట్
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జీవో నంబర్ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కు తీసుకోవాలని కోరుతూ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను దృష్టిలో ఉంచుకొని మంగళవారం తుడుందెబ్బ జిల్లా నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు వేంకగారి భూమయ్య మాట్లాడుతూ.. అరెస్టులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 3పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. నాయకపోడు జిల్లా అధ్యక్షుడు ముసలి చిన్నయ్య, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు సాకీ లక్ష్మణ్, రాజేశ్వర్, సాయన్న తదితరులు అరెస్ట్ అయ్యారు.

Advertisement

Next Story