- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ప్రతిమరాజ్
దిశప్రతినిధి, నిజామాబాద్:
నిజామాబాద్ ప్రభుత్వ వైద్యకళాశాల అనుబంధ జనరల్ ఆస్ప్రతి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ప్రతిమారాజ్ నియామకం అయ్యారు. ఈ మేరకు డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రి ఇన్ చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న ఫ్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీనియర్ ఫ్రొసెసర్‌లకు మాత్రమే సూపరింటెండెంట్లుగా నియమించే అవకాశం ఉంది.
జిల్లా కేంద్రంలో ముగ్గురు, నలుగురు ఫ్రొఫెసర్‌లు ఉండగా మిగిలిన వారు అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చి పోతుంటారు. నాగేశ్వర్ రావు రాజీనామా తర్వాత ఇద్ధరు ప్రొఫెసర్‌లు ఇన్ చార్జి సూపరింటెండెంట్ పదవి కోసం పోటిపడగా అందులో ఓ ప్రొఫెసర్ వారంతపు సెలవులో హైద్రాబాద్ వెళ్లడానికి అనుమతిస్తే చేస్తానని కోరగా, మిగిలిన ఆస్పత్రి కోవిడ్ నోడల్ ఆఫీసర్ ప్రతిమారాజ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదివారం ఉదయం ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
నేడు ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాక..
రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ అదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం కామారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి సమీక్షించనున్నారు. మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖాధికారులు, జిల్లా అధికారయంత్రాంగంతో సమీక్షిస్తారు.