- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీకే సంచలన ప్రకటన : ఇప్పటికే నా ఫోన్ 5 సార్లు మార్చా..
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో మరోసారి హ్యాకింగ్ కలకలం రేపడంతో ఆయన పెదవి విరిచారు. హ్యాకింగ్ కారణంగా ఇప్పటికే తాను ఐదు సార్లు ఫోన్ మార్చినట్లు ప్రకటించారు. ఎన్నిసార్లు ఫోన్ మార్చినా తనపై హ్యాకింగ్ దాడి జరుగుతూనే ఉందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఈ నెల 14న ఆయన ఫోన్ హ్యాకింగ్‌కు గురైంది.
అయితే, తాజాగా ఇజ్రయెల్ నుంచి ఇండియా పొందిన ‘స్పైవేర్ పెగాసస్’ ద్వారా దేశవ్యాప్తంగా పలువురి ఫోన్లు హ్యాక్ అయినట్లు ‘ది వైర్’ కథనాన్ని ప్రచురించింది. అందులో కేంద్ర మంత్రుల నుంచి భద్రతా దళాల చీఫ్ ఆఫీసర్లు, కీలక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, బడా వ్యాపారులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, అందులో తమ ప్రమేయం లేదని, ఆ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇదిలాఉండగా, ప్రస్తుతం వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడంతో ‘పెగాసస్’ దుమారంపై ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు తమ అస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి.