మనస్ఫూర్తిగా జగన్‌ను కలవాలనుకుంటే కలవొచ్చు: ప్రసాద్ రాజు

by srinivas |
మనస్ఫూర్తిగా జగన్‌ను కలవాలనుకుంటే కలవొచ్చు: ప్రసాద్ రాజు
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్‌ను కలవాలనే కోరిక ఉంటే తప్పకుండా ఆయనను కలిసే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు వ్యాఖ్యానించారు.

జగన్ చుట్టూ ఉండే కోటరీ కారణంగా ఆయనను కలిసే అవకాశం ఉండడం లేదని, అందుకే ప్రజా ప్రతినిధులు సమస్యలు మీడియాతో మాట్లాడాల్సి వస్తుందని రఘురామకృష్ణం రాజు ఆరోపించడంపై ప్రసాదరాజు మాట్లాడుతూ, కరోనా సమయంలో కూడా జగన్ అందరితో కలుస్తున్నారని అన్నారు.

జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడటం బాధాకరమన్న ఆయన, రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలు ప్రార్టీ శ్రేణులకు బాధను కలిగించాయని వ్యాఖ్యానించారు. జగన్‌కు పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదని, ఆయన ఏ చూపు చూస్తే మీరు పార్లమెంటు కమిటీ పదవి దక్కించుకున్నారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed