పచ్చిక బయళ్లలో ప్రణవ మోహన్ లాల్.. ‘హృదయ’ ప్రేమాయణం

by Jakkula Samataha |   ( Updated:2021-04-17 10:31:53.0  )
పచ్చిక బయళ్లలో ప్రణవ మోహన్ లాల్.. ‘హృదయ’ ప్రేమాయణం
X

దిశ, సినిమా : మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తనయుడు ప్రణవ మోహన్‌లాల్ స్టార్ కిడ్ అయినప్పటికీ.. మూవీపై ఉన్న పాషన్‌తో అందులోని 24 క్రాఫ్ట్స్ నేర్చుకున్న తర్వాతే సినిమా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు బాలనటుడిగా స్టేట్ అవార్డు సైతం అందుకున్న ప్రణవ.. ‘దృశ్యం, దృశ్యం-2’ ఫేమ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ వర్క్ చేశాడు. ఈ క్రమంలో ఆయన డైరెక్షన్‌లో‌నే ‘ఆది’ చిత్రం ద్వారా మలయాళ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పాటు ప్రణవ్‌కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రంలో ప్రణవ మోహన్ లాల్ హీరోగా మాత్రమే కాకుండా లిరిక్ రైటర్ అండ్ సింగర్‌గా వర్క్ చేయడం విశేషం.

ఈ చిత్రం తర్వాత ‘ఇరుపతియొన్నం నూట్టయండు’ చిత్రంలో నటించిన ప్రణవ మోహన్ లాల్.. ‘ప్రస్తుతం ‘హృదయం’ అనే సినిమాలో నటిస్తు్న్నాడు. మెర్రిల్యాండ్ సినిమాస్ సమర్పణలో విశాఖ్ సుబ్రమణ్యం నిర్మిస్తున్న ఈ చిత్రానికి వినీత్ శ్రీనివాసన్ డైరెక్టర్. ఈ సినిమాలో ప్రణవ మోహనలాల్‌కు జోడీగా కల్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ నటిస్తున్నారు. మూవీ ఫస్ట్ లుక్‌ను ఈ రోజు(శనివారం) విడుదల కాగా, ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పచ్చిక బయళ్ల నడుమ ప్రణవ మోహన్ లాల్.. కల్యాణి, దర్శనతో ప్రేమాయణం నడుపుతున్నట్లు కనిపిస్తోంది. కాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమాపై అంచనా పెంచేశారు మేకర్స్.

Advertisement

Next Story