నిరాశ్రయులకు ప్రకాశ్ రాజ్ ఆశ్రయం

by Shyam |
నిరాశ్రయులకు ప్రకాశ్ రాజ్ ఆశ్రయం
X

దిశ, వెబ్‌డెస్క్: విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ .. భారత సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దాదాపు 200 వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన … తన అద్భుత నటనకు నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. మరెన్నో అవార్డులతో సత్కరించబడ్డారు. నటుడిగా ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే ప్రకాశ్ రాజ్… దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. సామాజిక స్పృహతో ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించారు. గురువారం 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రకాశ్ రాజ్… కరోనా మహమ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే తన వంతు సాయంగా తన స్టాఫ్‌కు మే నెల వరకు జీతాలు ఇచ్చేసిన ప్రకాశ్ రాజ్…. తన జన్మదినాన్ని పురస్కరించుకుని దేశంలో లాక్ డౌన్ కారణంగా షెల్టర్ లేని పదకొండు మంది కూలీలకు తన ఫార్మ్ హౌజ్‌లో ఆశ్రయం కల్పించారు. పాండిచ్చేరి, చెన్నై, ఖమ్మంకు చెందిన వారికి ఆశ్రయం ఇచ్చానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన…. వారి కుటుంబాలతో మాట్లాడామని ఆర్థికసాయం కూడా అందిస్తామని తెలిపారు. కరోనాను నివారించడం కేవలం ప్రభుత్వం యొక్క బాధ్యత మాత్రమే కాదు… మనందరి బాధ్యత కూడా అన్నారు. ఇలాంటి సందర్భంలో మానవత్వాన్ని ప్రదర్శించి మీకు తోచిన సాయం అందించాలని అభిమానులను కోరారు.


Tags: Prakash Raj, CoronaVirus, Coivd19

Advertisement

Next Story

Most Viewed