- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
45ఏళ్ల పైబడిన వారు టీకా తీసుకోవాల్సిందే : కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ విధిగా కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు దేశంలో 60ఏళ్ల దాటిన వారు, 45ఏళ్ల పైబడిన వారిలో కరోనా లక్షణాలతో బాధపడే వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. కేంద్రం తాజా ఆదేశాలతో 45ఏళ్ల దాటిన అందరూ వ్యాక్సిన్ పొందేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. కరోనా వైరస్ టాక్స్‌ఫోర్స్ నిపుణల బృందం సలహా మేరకు కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని జవడేకర్ తెలిపారు.
ఇప్పటివరకు దేశంలో 4.85 కోట్ల మంది కనీసం తొలివిడత టీకా తీసుకున్నారని, 80 లక్షల మంది ప్రజలు రెండో విడత టీకా కూడా తీసుకున్నట్లు బుధవారం వెల్లడించారు. ఇదిలాఉండగా, పంజాబ్ రాష్ట్రంలో యూకే వేరియంట్ స్ట్రెయిన్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటంపై పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ రాష్ట్రంలోని యువతకు కరోనా వ్యాక్సిన్ పరిధిని పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.