స్వీయ నియంత్రణ పాటించండి

by vinod kumar |
స్వీయ నియంత్రణ పాటించండి
X

దిశ, మెదక్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. రాబోయే 10 రోజులు చాలా కీలకమన్నారు. మనల్ని మనమే కాపాడుకుంటూ సమాజాన్ని కూడా సురక్షితం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం 12 కిలోల రేషన్ బియ్యం, రూ.1500 ను ఉచితంగా పంపిణి చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించి కరోనా వైరస్ పై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజలు ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు.

tag;vanteru Pratap Reddy, corona, lockdown, ts news

Advertisement

Next Story

Most Viewed