- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘సలార్’ నుంచి న్యూ అప్‌డేట్.. ప్రభాస్‌కు జోడిగా మరో స్టార్ హీరోయిన్
దిశ, సినిమా : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. కాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వినిపిస్తోంది. ప్రభాస్‌కు జోడిగా ‘ఖిలాడి’ చిత్రంలో నటిస్తున్న యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి నటిస్తుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ముందుగానే ఈ సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలిపిన మేకర్స్.. నటీ నటులు, టెక్నికల్ టీమ్ విషయంలోనూ చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘సలార్’ మూవీలో ఉన్న ఓ కీ రోల్‌కి ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో నటిస్తున్న యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారట. మరి ఈ భామ ‘సలార్’లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో చూడాలంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతుండగా ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. ఇందులో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.