రాముడిగా ప్రభాస్.. వైరల్‌గా ఫ్యాన్ మేడ్ పోస్టర్

by Jakkula Samataha |   ( Updated:2020-11-09 07:36:00.0  )
రాముడిగా ప్రభాస్.. వైరల్‌గా ఫ్యాన్ మేడ్ పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే నేషనల్ వైడ్‌గా రచ్చ రచ్చే. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్న ప్రభాస్.. తర్వాత ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో బిగ్ ప్రాజెక్ట్ ఆది పురుష్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడన్న ప్రకటనే సినిమాకు భారీ హైప్ తీసుకురాగా.. అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నిజం చేప్పాలంటే రాధే శ్యామ్, నాగ్ అశ్విన్ సినిమాల కంటే కూడా ‘ఆది పురుష్’ సినిమా గురించే ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.

ఈ ఎగ్జైట్‌మెంట్‌లోనే.. ఎలాగూ మూవీ యూనిట్ ఇప్పుడప్పుడే అప్‌డేట్ ఇచ్చేలా లేదనుకున్న ఓ ఫ్యాన్.. మైండ్ బ్లోయింగ్ పోస్టర్ క్రియేట్ చేశాడు. రాముడిగా ప్రభాస్‌ను ట్విట్టర్‌కు పరిచయం చేస్తూ ఫ్యాన్ మేడ్ పోస్టర్ రిలీజ్ చేసి భారీ రెస్పాన్స్ అందుకున్నాడు. ఎడిట్ అరాచకంగా ఉందంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. డైరెక్టర్ ఓం రౌత్ ఎలాంటి లుక్‌లో చూపిస్తారో తెలియదు కానీ, మీరు మాత్రం అదిరిపోయేలా ఎడిట్ చేశారని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ పోస్టర్‌ ‘ఆదిపురుష్’ పేరుతో ట్రెండింగ్‌లో ఉండగా.. డైరెక్టర్ ఓం రౌత్ కూడా దీనిపై స్పందించి కాంప్లిమెంట్స్ ఇవ్వడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed